ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును సాంకేతికంగా, ఆర్థికంగా పునరుద్ధరించేందుకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు తెలిపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రాజెక్టుకు సంబంధించి సుందిళ్ల లింక్ ద్వారా సవరించిన సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం అధ్యయనం చేసిందని వెల్లడి

సవరించిన ప్రణాళిక వల్ల ప్రాజెక్టు వ్యయం దాదాపు 10 నుండి 12 శాతం వరకు తగ్గుతుందని చెప్పిన మంత్రి

భూసేకరణ కూడా దాదాపు సగానికి తగ్గుతుందని, మునుపటి ప్రణాళికలతో పోలిస్తే సుమారు రూ.1,500 నుంచి 1,600 కోట్ల వరకు ఆదా చేస్తుందని వివరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి