ఐదో టెస్టుకు పంత్‌ దూరం.. జట్టులోకి తమిళనాడు ప్లేయర్

భారత్ న్యూస్ గుంటూరు…..ఐదో టెస్టుకు పంత్‌ దూరం.. జట్టులోకి తమిళనాడు ప్లేయర్

భారత్-ఇంగ్లాండ్ మాంచెస్టర్ టెస్ట్‌ డ్రాగా ముగిసింది. చివరి టెస్ట్ జులై 31 నుంచి లండన్‌లో జరుగనుంది. కాగా ఐదో టెస్టుకు గాయం కారణంగా రిషబ్‌ పంత్‌ దూరం అయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అతని స్థానంలో వికెట్ కీపర్, బ్యాటర్ ఎన్ జగదీశన్ ను జట్టులోకి తీసుకున్నారు. పంత్‌ ఇప్పటివరకు సిరీస్‌లో 479 పరుగులతో అద్భుతంగా రాణించాడు. నాలుగో టెస్ట్‌లో గాయపడ్డా హాఫ్ సెంచరీ చేశాడు…