గవర్నర్‌ వద్దకు పంచాయతీ ఆర్డినెన్స్‌ ఫైల్‌

..భారత్ న్యూస్ హైదరాబాద్….గవర్నర్‌ వద్దకు పంచాయతీ ఆర్డినెన్స్‌ ఫైల్‌

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. దీనికి సంబంధించిన ఫైల్‌ను గవర్నర్‌ వద్దక పంపింది.

దీనిలో భాగంగా పంచాయతీ ఆర్డెనెన్స్‌ ఫైల్‌ను మంగళవారం(జూలై 15వ తేదీ) మంత్రి, సీఎం సంతకం చేసి రాజ్‌భవన్‌కు పంపింది ప్రభుత్వం. 285(A) సెక్షన్ లో సవరణ చేస్తూ ముసాయిదాను రాజ్ భవన్‌కు పంపారు.

ఎటువంటి లీగల్‌ చిక్కులు రాకండా ముసాయిదా డ్రాఫ్డ్‌ను గవర్నర్‌కు పంపించింది తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం. గవర్నర్‌ నుంచి ఆమోదం రాగానే ఆర్డినెన్స్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది ప్రభుత్వం.

ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలను మూడు నెలల్లో నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు డెడ్‌లైన్‌ విధించిన నేపథ్యంలో రిజర్వేషన్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగానే గవర్నర్ ఆమోదంతో పంచాయతీరాజ్ సవరణ చట్టం వీలైనంత త‍్వరగా అమల్లోకి తీసుకు రావడానికి యత్నాలు చేస్తోంది ప్రభుత్వం.