తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపుపై హైకోర్టు అసహనం,

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,,తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపుపై హైకోర్టు అసహనం

జనాభా లేని సామాజిక వర్గానికి సర్పంచ్ స్థానాన్ని ఎలా కేటాయిస్తారని అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు

ఎస్టీ సామాజిక వర్గానికి 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించారని, దీంతో అసలు ఎస్టీ జనాభా లేని పంచాయతీల్లో కూడా సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలు ఎస్టీలకు కేటాయింపబడ్డాయని హైకోర్టులో దాఖలైన పిటిషన్

వరంగల్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్ పట్నం గ్రామంలో కేవలం ఆరుగురు ఎస్టీ ఓటర్లు ఉండగా సర్పంచ్, రెండు వార్డు స్థానాలను వారికి రిజ్వర్

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం తక్కలపల్లిలో కేవలం 8 మంది ఎస్టీ ఓటర్లు ఉండగా సర్పంచ్ స్థానాన్ని వారికి రిజర్వ్

వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరపల్లిలో ఎస్టీ ఓటరు ఒక్కరూ లేకపోయినా సర్పంచ్ స్థానంతో పాటు మూడు వార్డు మెంబరు స్థానాలను ఆ సామాజిక వర్గానికి రిజర్వ్

నల్గొండ జిల్లా అనుముల మండలం శివాలయం పేరూరు గ్రామంలో ఎస్టీ ఓటర్లు లేకపోయినా సర్పంచ్ స్థానంతో పాటు 4 వార్డు మెంబర్లను రిజర్వ్

వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశలపల్లిలో సర్పంచ్, రెండు వార్డు మెంబరు స్థానాలు.. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం భట్ పల్లిలో సర్పంచ్, 6 వార్డు మెంబరు స్థానాలను 2011 జనాభా లేఖల ప్రకారం కేటాయించారని సింగిల్ బెంచ్ న్యాయమూర్తికి వివరించిన పిటిషనర్ తరపు న్యాయవాది

ఇరు వర్గాల వాదనలు విని, ఈ అంశంపై ఎలాంటి తీర్పు ఇచ్చినా తీవ్ర గందరగోళానికి దారి తీస్తుందని, దీనిపై డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకోవడమే మంచిదని అభిప్రాయపడుతూ బుధవారం డివిజన్ బెంచ్ ముందుకు పిటిషన్ తీసుకెళ్లాలని సూచించిన సింగిల్ బెంచ్ న్యాయమూర్తి

ఇదే సమయంలో ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రజలే లేకుండా, వారికి రిజర్వేషన్ కేటాయించడం నిరుపయోగమని తెలిపిన సింగిల్ బెంచ్ న్యాయమూర్తి టీ.మాధవీదేవి