డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్.. ఇకపై కొత్తగా యాజమాన్య హక్కు పత్రం

.భారత్ న్యూస్ హైదరాబాద్….డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్.. ఇకపై కొత్తగా ‘యాజమాన్య హక్కు పత్రం’

తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇళ్లు, ప్లాట్లకు కూడా వ్యవసాయ భూముల మాదిరిగా ‘యాజమాన్య హక్కు పత్రం’ ఇచ్చే కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా ఈ సిస్టమ్ పనిచేసి డబుల్ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూముల కబ్జాలను ఆటోమేటిక్గా అడ్డుకుంటుంది. లేఅవుట్ మోసాలకు బ్రేక్ వేస్తుంది. 1983 నుండి ఉన్న ఈసీ వివరాలను డిజిటల్ గా అనుసంధానం చేయడం వల్ల ఆస్తి చరిత్ర, లింక్ డాక్యుమెంట్లు స్పష్టంగా కనిపిస్తాయి.