మైదానంలోనూ ‘ఆపరేషన్‌ సిందూర్‌’: ప్రధాని మోదీ

భారత్ న్యూస్ ఢిల్లీ….మైదానంలోనూ ‘ఆపరేషన్‌ సిందూర్‌’: ప్రధాని మోదీ

ఫైనల్లో పాక్‌ను భారత్‌ మట్టికరిపించడంపై ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా ఆసక్తికర పోస్టు చేశారు. యుద్ధభూమిలోనూ, మైదానంలోనూ ఒక్కటే ఫలితమన్నారు. ‘‘మైదానంలోనూ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కనిపించింది. ఎక్కడైనా ఫలితం ఒక్కటే. ఇండియా గెలిచింది. భారత క్రికెటర్లకు అభినందనలు’’ అంటూ పోస్ట్‌ చేశారు. కాగా పాక్‌ను తిలక్ వర్మ గట్టి దెబ్బకొట్టి విజయ తిలకం దిద్దాడు.