ఆప‌రేష‌న్ సింధూర్‌లో ఎస్‌-400 ఫైరింగ్‌.. వీడియో రిలీజ్ చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఆప‌రేష‌న్ సింధూర్‌లో ఎస్‌-400 ఫైరింగ్‌.. వీడియో రిలీజ్ చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్

ఎస్‌-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్ట‌మ్‌(S-400 Missile System)కు చెందిన లైవ్ యాక్ష‌న్ వీడియోను ఇవాళ భార‌తీయ వైమానిక ద‌ళం రిలీజ్ చేసింది. గ‌త ఏడాది పాకిస్థాన్‌తో జ‌రిగిన ఆప‌రేష‌న్ సింధూర్ స‌మ‌యంలో ఎస్‌-400 మిస్సైల్ వ్య‌వ‌స్థ కీల‌క పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే. అయితే తొలిసారి ఈ క్షిప‌ణి ఫైరింగ్‌కు చెందిన వీడియోను రిలీజ్ చేస్తున్న‌ట్లు ఐఏఎఫ్ పేర్కొన్న‌ది. సైనిక చ‌రిత్ర‌లోనే ఈ మిస్సైల్ వ్య‌వ‌స్థ ఓ రికార్డును స్థాపించిన‌ట్లు పేర్కొన్నది. చాలా దూరం నుంచి గ‌గ‌న‌త‌లంలోనే విమానాన్ని షూట్ చేసిన‌ట్లు ఐఏఎఫ్ త‌న వీడియో ద్వారా వెల్ల‌డించింది.