భారత్ న్యూస్ అమరావతి..నేటి నుంచి బీఎస్సీ నర్సింగ్ ఆన్లైన్ దరఖాస్తులు
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని నర్సింగ్ వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న బీఎస్సీ నర్సింగ్ (నాలుగేళ్ల) కోర్సు కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే విశ్వవి ద్యాలయం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సెప్టెంబరు 4వ తేదీ రాత్రి 7 గంటల్లోగా సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
