.భారత్ న్యూస్ హైదరాబాద్….నియోజకవర్గానికి ఒకటి చొప్పున మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్లు: రేవంత్ రెడ్డి…
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ సిటిజన్ల కోసం ‘ప్రాణం’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా వృద్ధులకు వినోదం, ఆహ్లాదంతో పాటు వైద్యం, ఆటలు, పుస్తకాలు, ఉచిత ఆహారం కూడా అందించబడుతుంది. ఈ సెంటర్లు ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాలు మినహా అన్ని రోజుల్లో ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయి. వారానికి ఒకసారి ఉచిత వైద్య పరీక్షలు, మందులు అందిస్తారు. ప్రస్తుతం జిల్లాకు ఒకటి చొప్పున 39 సెంటర్లు, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, హన్మకొండ జిల్లాల్లో రెండేసి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు….
