భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లోని గోషామహల్‌లో కృత్రిమంగా పండించిన సుమారు 200 కిలోల మామిడిపండ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. “డైమండ్ రైప్” ఎథిలిన్ రసాయనాన్ని అధికంగా ఉపయోగించినట్లు గుర్తించారు.

ప్రతి 20 కిలోల ట్రేకు 5 సాచెట్లు మాత్రమే అనుమతి ఉండగా, వ్యాపారి 6 సాచెట్లు ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు.ఇలాంటి రసాయనాలతో పండించిన మామిడిపండ్లు వాంతులు, విరేచనాలు, శ్వాస సమస్యలకు కారణమవుతాయని వైద్య నిపుణులు హెచ్చరించారు.