భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ప్రజా భవన్ లో సమావేశమైంది.
ఈ సమావేశానికి కమిటీ చైర్మన్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు సబ్ కమిటీ సభ్యులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఆడిటర్ జనరల్ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
