నేటి నుంచే నోబెల్ బహుమతి విజేతల ప్రకటన!

…భారత్ న్యూస్ హైదరాబాద్….నేటి నుంచే నోబెల్ బహుమతి విజేతల ప్రకటన!

నోబెల్ బహుమతికి అమెరికా అధ్యక్షుడు దూరం?


ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతులు అక్టోబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రకటించనున్నారు. మొత్తం ఆరు రంగాల్లో ర‌సాయ‌న‌, భౌతిక‌, సాహిత్యం, శాంతి, ఆర్థిక‌శాస్త్రం, మెడిసిన్ విభాగంలో అత్యుత్త‌మ సేవ‌లు అందించిన వారికి ఈ అవార్డును ప్ర‌క‌టించ‌ నున్నారు. విజేతల పేర్లను వాలెన్‌బర్గ్‌సాలెన్‌లోని కరోలిన్స్కా ఇన్‌స్టిట్యూట్‌ లో నోబెల్ అసెంబ్లీ ప్రకటిస్తుంది.

తర్వాత భౌతిక శాస్త్రం నుంచి విజేతలను స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటిస్తుంది. సాహిత్యంలో నోబెల్ బహుమతిని అక్టోబర్ 9న స్టాక్‌హోమ్ నుంచే ప్రకటించ నున్నారు. తరువాత 10వ తేదీన నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తారు.

ప్రముఖ వ్యాపారవేత్త, శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణం తరువాత ఈ నోబెల్ బహుమతులు అందజేస్తున్నారు.ప్రతి ఏడాది డిసెంబర్ 10న నోబెల్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి. ఈ రోజున నోబెల్ బహుమ తులు గ్రహీతలకు ప్రదానం చేస్తారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లువురు భార‌త్‌కు చెందిన ప్ర‌ముఖులు నోబెల్ పుర‌స్కారాన్ని పొందారు. 1913లో సాహిత్యంలో ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్‌, సీవీ. రామ‌న్(భౌతిక‌శాస్త్రం-1930), మ‌థ‌ర్ థెరిస్సా శాంతి-1979 అమ‌ర్త్య సేన‌(అర్థిక శాస్తం-1998), కైలాస్ స‌త్యనాథ్‌ శాంతి-2014 త‌దిత‌రులు ఈ అవార్డును అందుకున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారంపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఎలాగైనా ఈ సారి నోబెల్ పీస్ ప్రైజ్ దక్కించుకోవాల్సిందేనని పట్టుదలగా ఉన్నారు. తాను శాంతిదూతనని పలుమార్లు ప్రకటించుకున్న ట్రంప్ అధికారం చేపట్టిన తొమ్మిది నెలల్లోనే ఏడు యుద్ధాలు ఆపినట్టు గొప్పలుపోతున్నారు. పాకిస్తాన్, ఇజ్రాయెల్ దేశాధినేతలు ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు కూడా.

ఈ నెల 10న నార్వేజియన్ నోబెల్ కమిటీ శాంతి పురస్కారాన్ని ప్రకటించ నుంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ ప్రయత్నాలపై ఆసక్తి పెరుగుతున్నది.ఇజ్రాయెల్- అరబ్ దేశాల మధ్య ఆబ్రహం ఒప్పందం, కాంగో- రువాండ రెబల్స్, థాయిలాండ్-కంబోడియా వంటి ఘర్షణలను ఆయన నిలిపేసినట్టు ట్రంప్ ప్రకటించుకున్నారు.