భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన సబ్సిడీ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేసేలా విధివిధానాలు రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రానున్న ఖరీఫ్-2026 సీజన్ ముందస్తు చర్యలపై హైదరాబాద్లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం యంత్రాల కొనుగోలుపై ఇచ్చే 40 శాతం సబ్సిడీని కంపెనీలకు కాకుండా, నేరుగా రైతులకు అందించే అంశాన్ని పరిశీలించాలని మంత్రి సూచించారు.
