జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు ఏప్రిల్ 25 ననూతన రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు వెల్లడించారు.

భారత్ న్యూస్ వరంగల్….. …..హైదరాబాద్:ఏప్రిల్ 10
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు ఏప్రిల్ 25 న ఉదయం 10 గంటలకు నూతన రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు వెల్లడించారు మేడ్చల్ జిల్లా ముషీరాబాద్ లోని అధ్యాయ కన్వెన్షన్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పార్టీ ప్రకటన చేయబోతున్నట్లు చెప్పారు అదే రోజు పార్టీ పేరు జెండాను ప్రకటిస్తామన్నారు.

బుధవారం సాయంత్రం నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ తో పాటు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఆయన అనుచరులు వెయ్యి మంది ఆమె సమక్షంలో జాగృతిపార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇది కొత్త రక్తం, కొత్త రాజకీయాలతో ప్రజల ముందుకు కొత్త పార్టీని తీసుకొస్తున్నామ న్నారు. ఏప్రిల్ 25 తెలంగా ణ భవిష్యత్తును మార్చే రోజు అవుతుందన్నారు.

తెలంగాణ ప్రజల సమస్య లను అధికార పార్టీ, ప్రతిపక్షం పార్టీ రెండు పార్టీలు పట్టించుకోవడం లేదన్నారు. సామాన్యుల చేత సామాన్యుల కోసం సామాన్యులే ఉండే రాజకీయం చేస్తామన్నారు ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు.