ఎన్నికలకు సిద్ధంగా ఉన్న అస్సాం రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు.

భారత్ న్యూస్ ఢిల్లీ….
✈️ఈశాన్యం’లో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ షురూ

ఎన్నికలకు సిద్ధంగా ఉన్న అస్సాం రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు.

డిబ్రూగఢ్‌-మోరన్‌ జాతీయ రహదారిపై నిర్మించిన అత్యవసర రహదారిపై సీ-130జె ఆయన ప్రయాణించిన విమానం ల్యాండింగ్‌ కావడంతో ఈశాన్య భారతంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సౌకర్యం (ఈఎల్‌ఎఫ్‌) ప్రారంభమైంది.

సాధారణంగా భారీ వాహనాలు ప్రయాణించే ఈ హైవేపై 4.2 కి.మీ విస్తీర్ణాన్ని ఇప్పుడు విపత్తులు లేదా ఆకస్మిక పరిస్థితులలో సాయుధ దళాలకు అత్యవసర ల్యాండింగ్‌ స్ట్రీప్‌గా ఉపయోగపడేలా అప్‌గ్రేడ్‌ చేశారు. 2021లో రూ. 98.86 కోట్లతో రూపొందించిన నాలుగు లేన్‌ల ఈఎల్‌ఎఫ్‌ ప్రాజెక్టు సైనిక, పౌర విమానాల ల్యాండింగ్‌లు, టేకాఫ్‌లకు ఉపయోగపడేలా భారత వైమానిక దళ సమన్వయంతో నిర్మించారు.

ఈ సందర్భంగా ఎయిర్‌ ఫోర్స్‌ నిర్వహించిన 20 ఎయిర్‌షోలో హైవేపై విమానాల ల్యాండింగ్‌, టేకాఫ్‌, ఇతర విన్యాసాలను ప్రదర్శించారు. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ఆరు లేన్ల వంతెనను, ఒక ఐఐఎంను, ఒక డాటా సెంటర్‌ను మోదీ తన పర్యటనలో భాగంగా ప్రారంభించారు.