డాక్టర్ కోట శ్రీహరి రావు హత్య కేసు CID కి బదిలీ.

భారత్ న్యూస్ గుంటూరు..డాక్టర్ కోట శ్రీహరి రావు హత్య కేసు CID కి బదిలీ

అవనిగడ్డ, కృష్ణా జిల్లా:

అవనిగడ్డలో ఐదేళ్ల క్రితం జరిగిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ కోట శ్రీహరి రావు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐదేళ్లు గడిచినా నిందితుల అరెస్టు గానీ, చార్జిషీట్ గానీ దాఖలు కాకపోవడంతో స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ఈ నేపథ్యంలో వైసీపీ నేత గౌతమ్‌ ఆంధ్రప్రదేశ్ డీజీపీకి మరియు కృష్ణా జిల్లా ఎస్పీ కు కేసుపై సమగ్ర విచారణ జరపాలని ది 14/11/2025 న కోరారు.

కేసును తాజాగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ మరియు కృష్ణా జిల్లా ఎస్పీ గార్ల ఉత్తర్వుల మేరకు అవనిగడ్డ సీఐ గారు సీఐడీ (CID), AP వారికి ది.08/12/25 న బదిలీ చేశారని తెలుపుతూ దీనికి సంబంధించి అవనిగడ్డ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కె. శ్రీనివాసరావు గారి ద్వారా ఈరోజు అధికారిక (PGRS) పత్రము గౌతమ్ గారికి అందజేయటం జరిగింది.