భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….తెలంగాణాలో వార్డు మెంబర్లు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ల జీతం ఎంతో తెలుసా…అక్షరాలా…?
తెలంగాణాలో వార్డు మెంబర్లు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ల జీతం ప్రస్తుతం 2021 సంవత్సరంలో పెంచిన మొత్తాలే కొనసాగుతున్నాయి.
- సర్పంచ్ 2021 పూర్వం 5,000 కాగా ప్రస్తుతం రూ. 6,500 రూ.,
- ఎంపీటీసీ (మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు) రూ. 6,500 ,
- జెడ్పీటీసీ (జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు) రూ. 13,000 ,
- ఎంపీపీ (మండల పరిషత్ అధ్యక్షులు) రూ. 13,000 ,
- జడ్పీపీ (జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్) రూ. 1 లక్ష వరకు
అభ్యర్థుల వ్యయ పరిమితి
తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం, తెలంగాణ ఎన్నికల సంఘం అభ్యర్థుల వ్యయ పరిమితిని ఖరారు చేసింది. ఉల్లంఘనకు పాల్పడితే.. అభ్యర్థులు మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అవుతారు, గెలిచినా పదవిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
- సర్పంచ్ 5,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో రూ. 2.50 లక్షలు,
- వార్డు సభ్యుడు – రూ. 50 వేలు,
- జెడ్పీటీసీ అభ్యర్థి – రూ. 4 లక్షలు,
- ఎంపీటీసీ అభ్యర్థి – రూ. 1.50 లక్షలు
అభ్యర్థుల తరఫున రాజకీయ పక్షాలు చేసే ఖర్చులు కూడా అభ్యర్థి ఖాతాకే జమ అవుతాయి. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తేదీ నుంచి 45 రోజులలోపు ఖర్చుల తుది నివేదికను సంబంధిత అధికారికి సమర్పించాలి.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల విధివిధానాలు
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కల్పించేలా మార్గదర్శకాలను జారీ చేస్తూ, శనివారం (నవంబర్ 22, 2025) నాడు జీవో (ప్రభుత్వ ఉత్తర్వు)ను విడుదల చేసింది.
గరిష్ట పరిమితి: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా చూస్తారు.
మహిళా రిజర్వేషన్లు: మహిళలకు 50 శాతం వరకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. ఈ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ సహా అన్ని కేటగిరీలలో సమానంగా అమలు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
షెడ్యూల్డ్ ఏరియాలు:
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244 ప్రకారం షెడ్యూల్డ్ (ఏజెన్సీ) ప్రాంతాల్లో రిజర్వేషన్లను అమలు చేయనున్నారు.
రొటేషన్ పద్ధతి:
గత (2019) ఎన్నికల్లో ఏ కేటగిరీకి రిజర్వేషన్లు కేటాయించారో, వాటిని పరిగణనలోకి తీసుకుని, తాజా రొటేషన్ (మార్పిడి) పద్ధతి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టం చేశారు.
రిజర్వేషన్ల కేటాయింపుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆధారం వివరాలు కింద ఇవ్వబడ్డాయి:
సర్పంచులు (బీసీ అభ్యర్థులు) 2024 కుల సర్వే (Caste Survey)
వార్డు మెంబర్లు 2024 కుల సర్వే (Caste Survey)

సర్పంచులు (ఎస్సీ/ఎస్టీ/ఓసీ) 2011 జనాభా లెక్కలు (Census)