నేడు నుంచి రాష్ట్రంలో మోస్తరు వర్షాలు

..భారత్ న్యూస్ హైదరాబాద్….నేడు నుంచి రాష్ట్రంలో మోస్తరు వర్షాలు

తెలంగాణలో రాగల రెండు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. సోమవారం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. పలుచోట్ల బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. గత మూడు రోజులుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిశాయి. దీంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు….