.భారత్ న్యూస్ హైదరాబాద్….మహిళలపై దుష్ప్రచారం నేరమంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ ట్వీట్
ప్రజా జీవితంలో విమర్శలు సహజమే.. కానీ మహిళలపై వ్యక్తిగత దాడులు, చరిత్ర హననం, అసభ్య వ్యాఖ్యలు విమర్శలు కావు– అవి క్రూరత్వం
ప్రభుత్వ ఉద్యోగి అయినా, ప్రైవేట్ ఉద్యోగి అయినా, గృహిణి అయినా మహిళ గౌరవం అపరిమితం
టీవీ చర్చలు, సోషల్ మీడియా పోస్టులు, వార్త కథనాల పేరుతో మహిళలపై దూషణలు అసహ్యకరం
నేటి మహిళ ముందు వరుసలో నాయకత్వం వహిస్తోంది
“యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః”
మహిళలకు గౌరవం ఉన్న చోటే సుభిక్షం ఉంటుంది
మహిళా అధికారులపై ఉద్దేశపూర్వక దుష్ప్రచారం ఆందోళనకరం
వ్యక్తిగతంగా దెబ్బతీయడం, ప్రతిష్ఠను నాశనం చేయడం ఏమాత్రం ఆమోద యోగ్యం కాదు
మహిళలను గౌరవించని సమాజం భవిష్యత్తును కోల్పోతుంది

మహిళలపై అవమానం, వివక్ష, చరిత్ర హననం ఇక సహించం
ది ఫ్యూచర్ ఈజ్ ఫీమేల్
వీసీ సజ్జనార్