…భారత్ న్యూస్ హైదరాబాద్….Milk: కల్తీ పాలను గుర్తించడం చాలా ఈజీ.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
అమృతం లాంటి పాలు నేడు కాలకూట విషంగా మారుతున్నాయి. తెల్లగా కనిపిస్తున్న ప్రతి చుక్కా స్వచ్ఛమైనది అనుకుంటే పొరపాటే.. కొందరు కేటుగాళ్లు పాలను చిక్కగా మార్చడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. చిన్నారుల ఎదుగుదలకు తోడ్పడాల్సిన పాలు, వారి ప్రాణాలనే హరించే సైలెంట్ కిల్లర్స్‌గా మారుతున్నాయి.
ప్రస్తుతం కాలంలో పాలు కాస్త విషయంగా మారుతున్నాయి. మనం మన బిడ్డలకు గ్లాసుడు అమృతం ఇస్తున్నామని సంబరపడుతుంటే.. స్వార్థపరులు అందులో యూరియా, డిటర్జెంట్, స్టార్చ్ వంటి భయంకర రసాయనాలు కలిపి స్లో పాయిజన్‌ను అందిస్తున్నారు. పాలు తెల్లగా ఉన్నాయి కదా అని తాగేస్తే.. అవి మీ కిడ్నీలను, ప్రేగులను చిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉంది. అసలు ఈ తెల్లని మాఫియా పాలను ఎలా కల్తీ చేస్తోంది? పాలలో దాగి ఉన్న ఆ నల్లని నిజాలేంటి? మీ ఇంట్లోనే కల్తీని ఎలా పట్టేయాలి? అనేది తెలుసుకుందాం..
కల్తీ వెనుక ఉన్న భయంకర రసాయనాలు:

కేవలం నీళ్లు కలపడం పాత పద్ధతి. ఇప్పుడు లాభాల కోసం ముఠాలు వాడుతున్న పదార్థాలు ఇవే..