ఉపాధి హామీ పథకంలో ఔషధ మొక్కలు పెంచాలి: భట్టి విక్రమార్క

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఉపాధి హామీ పథకంలో ఔషధ మొక్కలు పెంచాలి: భట్టి విక్రమార్క

తెలంగాణ :

ప్రపంచం ఆయుర్వేదం వైపు చూస్తున్న నేపథ్యంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా ఔషధ మొక్కలు పెంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి సమీక్షా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే సంక్షేమ వసతి గృహాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, మరమ్మతుల బిల్లులు ప్రతి 15 రోజులకు ఒకసారి క్లియర్ చేస్తామని అన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు.