మేడారం జాతరకు భారీగా ఏర్పాట్లు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….మేడారం జాతరకు భారీగా ఏర్పాట్లు

తెలంగాణలో వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో జరిగే మేడారం జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జాతర జరిగే ప్రాంతాన్ని 8 జోన్లు, 31 సెక్టార్లుగా విభజించారు. 1,050 ఎకరాల్లో 49 పార్కింగ్ స్థలాలు, భక్తుల కోసం 24 శాశ్వత, 20 తాత్కాలిక మొబైల్ టవర్లు, నిరంతర విద్యుత్ సరఫరా చేయనున్నారు. జాతర బందోబస్తు కోసం 12 వేల మంది పోలీసులు విధుల్లో ఉంటారని అధికారులు తెలిపారు.