భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ఆదిలాబాద్‌లో గంజాయి సాగు.. పట్టుబడ్డ రైతు
జైనూర్ మండలం ఢాబోలీ గ్రామానికి చెందిన అథ్రం లక్ష్మణ్ (55) తన భూమిలో 10 గంజాయి మొక్కలను సాగు చేస్తుండగా జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ బృందం శనివారం పట్టుకుంది.
నిందితుడిని మొక్కలతో పాటు జైనూర్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు.
గంజాయి సాగు, వినియోగం, రవాణా నేరమని, ఇలాంటి అక్రమాలకు కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ హెచ్చరించారు.
