హైదరాబాద్‌లోని దుర్గం చెరువు నిర్వహణ బాధ్యతలను హైడ్రా పూర్తిస్థాయిలో స్వీకరిస్తుందని

..భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లోని దుర్గం చెరువు నిర్వహణ బాధ్యతలను హైడ్రా పూర్తిస్థాయిలో స్వీకరిస్తుందని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ప్రస్తుతం గుర్రపుడెక్క వల్ల చెరువు నీరు కలుషితమై పర్యాటక రంగం తీవ్రంగా ప్రభావితమైంది. దీని కారణంగా ఇక్కడ పర్యాటక బోట్లు నడపడం అసాధ్యంగా మారింది.

ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా జీహెచ్‌ఎంసీ, జలమండలి, నీటిపారుదల శాఖ, రహేజా ప్రతినిధులతో కలిసి ఆ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.