చంద్ర గ్రహణ విశేషాలు

..భారత్ న్యూస్ హైదరాబాద్….చంద్ర గ్రహణ విశేషాలు

తేదీ: 7 సెప్టెంబర్ 2025 ఆదివారం
తిథి: భాద్రపద పౌర్ణమి
నక్షత్రం: శతభిషము, పూర్వాభాద్ర,
రాశి: కుంభరాశి
గ్రహణం రకం: రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం…
భారతదేశంలో మొత్తం ఈ గ్రహణం స్పష్టంగా కనబడుతుంది.

గ్రహణ కాలమానం🌔…

స్పర్శ (ప్రారంభం): రాత్రి 9:57

సంపూర్ణ గ్రహణ ప్రారంభం: రాత్రి 11:00

మధ్యకాలం: రాత్రి 11:41

విడుపు ప్రారంభం: రాత్రి 12:22 (8వ తేదీ)

ముగింపు: ఉదయం 1:26 (8వ తేదీ)

పుణ్యకాలం: 3 గంటలు 29 నిమిషాలు
సంపూర్ణ బింబ దర్శనం: 1 గంట 22 నిమిషాలు

రాశులపై ప్రభావం…
ప్రతికూల ప్రభావం కలిగే రాశులు:
వృషభ, మిథున, సింహ, కన్య, తుల,
మకర, కుంభ, మీన
వీరు మహాశివారాధన శివాభిషేకం చేయడం, ఉపవాసం, జపం చేయడం మంచిది.
శివారాధన [ శివనామ జపం ]
అని ఆ పరమేశ్వరుని,విష్ణుమూర్తి నామ జపము మంచిది.

ఈ కింది రాశులు శుభం అని ఉన్న రాశులు దానం చేయవలసిన అవసరం లేదు హాని అని ఉన్న రాశుల వారు దానం చేయాలి నక్షత్ర వివరణ కోసం మరియు క్రింద చూడండి..

  1. మేష~ ధన లాభం {శుభం}
  2. వృషభం~ వ్యధ {హాని}
  3. మిధునం~ చింత {హాని}
  4. కర్కాటకం~ సౌఖ్యం {శుభం
  5. సింహం~ స్త్రీ కష్టం {హాని}
  6. కన్య~ అతి కష్టం {హాని}
  7. తుల~ మాన నాశనం {హాని}
  8. వృశ్చికం~ సుఖం {శుభం
  9. ధనస్సు~ లాభం {శుభం
  10. మకరం~ వ్యయం {హాని}
  11. కుంభం~ ఘాతం {హాని}
  12. మీనం~ హాని {ఘాతం}

శుభం అని రాసివున్న వారికి ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు.

  1. మేష~ ధన లాభం {శుభం}
    అశ్విని 1,2,3,4 పాదాలు
    భరణి 1,2,3,4 పాదాలు
    కృత్తిక 1 పాదం
    దానం ఇవ్వాల్సిన అవసరం లేదు.
  2. వృషభం~ వ్యధ {హాని}
    కృత్తిక 2,3,4 పాదాలు
    రోహిణి 1,2,3,4 పాదాలు
    మృగశిర 1,2 పాదాలు
    దానం ఇవ్వాలి.
  3. మిధునం~ చింత {హాని}
    మృగశిర 3,4 పాదాలు
    ఆరుద్ర1,2,3,4 పాదాలు
    పునర్వసు1,2,3 పాదాల వారు
    దానం ఇవ్వాలి.
  4. కర్కాటకం~ సౌఖ్యం {శుభం
    పునర్వసు 4 పాదం
    పుష్యమి1,2,3,4 పాదాలు
    ఆశ్లేష 1,2,3,4 పాదాల వారు
    దానం ఇవ్వాల్సిన అవసరం లేదు.
  5. సింహం~ స్త్రీ కష్టం {హాని}
    మఖ 1,2,3,4 పాదాలు
    పుబ్బ 1,2,3,4 పాదాలు
    ఉత్తర 1 పాదాల వారు
    దానం ఇవ్వాలి.
  6. కన్య~ అతి కష్టం {హాని}
    ఉత్తర 2,3,4 పాదాలు
    హస్త 1,2,3,4 పాదాలు
    చిత్త 1,2 పాదాల వారు
    దానం ఇవ్వాలి.
  7. తుల~ మాన నాశనం {హాని}
    చిత్త 3,4 పాదాలు
    స్వాతి 1,2,34 పాదాలు
    విశాఖ1,2,3 పాదాల వారు
    దానం ఇవ్వాలి.
  8. వృశ్చికం~ సుఖం {శుభం
    విశాఖ 4 పాదం
    అనురాధ1,2,3,4 పాదాలు
    జేష్ఠ 1,2,3,4 పాదాల వారు
    దానం ఇవ్వాల్సిన అవసరం లేదు.
  9. ధనస్సు~ లాభం {శుభం
    మూల 1,2,3,4 పాదాలు
    పూర్వాషాడ1,2,3,4 పాదాలు
    ఉత్తరాషాడ 1 పాదం వారు
    దానం ఇవ్వాల్సిన అవసరం లేదు.
  10. మకరం~ వ్యయం {హాని}
    ఉత్తరాషాడ 2,3,4 పాదాలు
    శ్రవణం 1,2,3,4 పాదాలు
    ధనిష్ట 1,2 పాదాలు
    దానం ఇవ్వాలి.
  11. కుంభం~ ఘాతం {హాని}
    ధనిష్ట 3,4 పాదాలు
    శతభిషం 1,2,3,4 పాదాలు,
    పూర్వాభాద్ర 1,2,3 పాదాల వారు
    దానం ఇవ్వాలి.
  12. మీనం~ హాని {హాని}
    పూర్వభద్ర 4 పాదం
    ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదాలు
    రేవతి 1,2,3,4 పాదాల వారు
    దానం ఇవ్వాలి.

(ఆధ్యాత్మిక భావాలు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ గ్రహణము రోజున, దైవ జపం, దానము చేయుట మంచిది)

దాన సామాగ్రి
రజిత ( వెండి చంద్ర, నాగబింబములు)
తెల్లటి వస్తువులు, తెల్ల వస్త్రము, బియ్యము 1.1/4 kg

నీలంవస్త్రము, మినపగుండ్లు 1.1/4 kg,
తమలపాకులు, వక్కలు, ఏవైనా పళ్ళు
తాంబూలాది దక్షిణలు
స్వయంపాకానికి వస్తు సామాగ్రి అన్నీ కలిపి బ్రాహ్మణులకు మీ పేరు,గోత్రములు చెప్పి దానముగా ఇవ్వండి.

ఆలయములలో పాటించే విధానం

గ్రహణానికి ముందు: సెప్టెంబర్ 7న మధ్యాహ్నం లోపు అన్ని దేవాలయాల్లో నివేదనలు సమర్పించి, ఆలయ ద్వారాలు మూసి వేస్తారు. సాయంకాల దర్శనం
ఉండదు. (శ్రీకాళహస్తి దేవాలయంలో ఈ నియమాలు వర్తించవు.)

గ్రహణం తరువాత: సెప్టెంబర్ 8 ఉదయం ఆలయాన్ని మొత్తం కడిగి శుభ్రం చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య సంస్కారం చేసి, విగ్రహాలకు అభిషేకాలు చేసి భక్తులకు దర్శనం ఇవ్వబడుతుంది.

ఆచారాలు (గ్రహణ రోజున)…

తద్దినాలు పెట్టుకోవాలనుకునే వారు మధ్యాహ్నం 1:20 లోపు పెట్టుకోవాలి.

గ్రహణ కాలంలో స్నానాలు, ఉపవాసం,దైవనామ స్మరణ, మంత్రజపం,దానధర్మాలు చేయాలి.

గర్భిణీ స్త్రీలు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలి (కత్తెర, సూది పనులు చేయరాదు, అసలు బయటకు వెళ్లరాదు).

మొత్తానికి 7 సెప్టెంబర్ 2025 చంద్రగ్రహణం భారతదేశంలో పూర్తిగా దర్శనమయ్యే అరుదైన గ్రహణం, ఇది కొందరికి ఆధ్యాత్మిక పరంగా శ్రేయస్కరమైతే,
విశాఖ
శతభిషం
పూర్వాభాద్ర నక్షత్రాల వారికి శాంతి జపాలు అవసరం.

శుభమస్తు