షిరిడీలో మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం.

భారత్ న్యూస్ గుంటూరు….షిరిడీలో మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం

శ్రీసాయినాధుని దర్శించుకునేందుకు మంత్రి నారా లోకేష్ సతీ సమేతంగా షిరిడీ చేరుకున్నారు. రేపు ఉదయం (సోమవారం) సాయిసన్నిధిలో నిర్వహించే కాకడ హారతిలో లోకేష్, బ్రాహ్మణి దంపతులు పాల్గొంటారు. షిరిడీ చేరుకున్న లోకేష్ దంపతులకు కోపర్గావ్ ఎమ్మెల్యే, శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మాజీ చైర్మన్ అశుతోష్ ఆకాశరావు కాలే, ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. మంత్రి వెంట చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు ఉన్నారు.