భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….తెలంగాణలో ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు
రాష్ట్ర వ్యాప్తంగా దాఖలైన 95,436 దరఖాస్తులు
గతంతో పోలిస్తే భారీగా 37 వేలు తగ్గిన దరఖాస్తుల సంఖ్య .. పెరిగిన 218 కోట్ల ఆదాయం
గడువు పెంచడంపై నేడు హైకోర్టులో విచారణ..పెంచిన గడువు రద్దు చేస్తూ తీర్పు వస్తుందేమోనని వ్యాపారుల ఆందోళన
తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్ల కోసం దరఖాస్తులకు గడువు ముగిసేనాటికి 95,436 దరఖాస్తులు దాఖలైనట్లు వెల్లడించిన ఎక్సైజ్ శాఖ అధికారులు
గతేడాది 1.32 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి భారీగా 37 వేలు తగ్గిపోయిన దరఖాస్తుల సంఖ్య
దరఖాస్తుల సంఖ్య తగ్గినా, టెండర్ ధర రూ.3 లక్షలు చేయడంతో గతంలో కంటే స్వల్పంగా ఎక్కువ ఆదాయం రాబట్టిన ప్రభుత్వం
అక్టోబర్ 18వ తేదీన ముగియాల్సిన దరఖాస్తుల గడువును, ఆశించిన మేరకు ఆదాయం రాలేదని అక్టోబర్ 23వ తేదీ వరకు పొడిగించిన ఎక్సైజ్ శాఖ

గడువు పెంచడం చట్ట విరుద్ధమని దాఖలైన పిటిషన్ పట్ల, నేడు విచారణ జరపనున్న హై కోర్టు