రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద

భారత్ న్యూస్ డిజిటల్:మంచిర్యాల:

రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది

రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద

జనవరి 14, 2026:
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. బుధవారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ రాజు లతో కలిసి శంకుస్థాపనలు చేశారు. రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా అనేక పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని వార్డులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ వార్డులలో నివాసాలకు సమీపంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లను వేరే ప్రదేశాలకు మార్చేలా త్వరలోనే పనులు చేపడతామని తెలిపారు. అమృత్ పథకం క్రింద క్యాతనపల్లి మున్సిపాలిటీకి 40 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, ఈ పథకంలో చేపట్టిన పనులు దాదాపు 50 శాతం పూర్తయ్యాయని, త్వరలోనే మిగిలిన పనులను పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా శుద్ధమైన త్రాగునీటి అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు వేగవంతమైన, మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు, సిబ్బంది సంఖ్యను పెంచి ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. గత 10 సంవత్సరాల కాలంలో అందని రేషన్ కార్డులను ప్రభుత్వం పేద ప్రజలను గుర్తించి అందించడం జరిగిందని, ప్రజాపంపిణీ వ్యవస్థలో చౌక ధరల దుకాణాల ద్వారా అర్హులైన రేషన్ కార్డుదారులకు ప్రతినెల సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. వచ్చే నెల నుండి అర్హత గల లబ్ధిదారులకు పెన్షన్లు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. క్యాతనపల్లి మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయల నగర అభివృద్ధి నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, వీటితోపాటు డి ఎం ఎఫ్ టి, సి ఎస్ ఆర్ నిధుల ద్వారా ప్రజా ప్రయోజనాలకు అవసరమయ్యే పనులకు వినియోగిస్తామని తెలిపారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 6 వ వార్డు భగత్ సింగ్ నగర్ లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద 87 లక్షల 58 వేల రూపాయల టి.యు.ఎఫ్.ఐ.డి.సి. నిధులతో అంతర్గత రహదారులు, మురుగు కాలువల నిర్మాణం,  21వ వార్డులో జెండా సమీపంలోని మెయిన్ రోడ్డులో 20 లక్షల రూపాయల నగరాభివృద్ధి నితులతో అంతర్గత రహదారులు, మురుగు కాలువల నిర్మాణం, 17 వ వార్డులో రాజీవ్ చౌక్ వద్ద 50 లక్షల రూపాయల నగరాభివృద్ధి నిధులతో అంతర్గత రహదారులు, కాలువల నిర్మాణం, 20 వ వార్డు శ్రీనివాస నగర్ – ప్రగతి నగర్ జంక్షన్ వద్ద 38 లక్షల రూపాయల నగరాభివృద్ధి నిధులతో అంతర్గత రహదారులు, మురుగు కాలువల  నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. 3వ వార్డు ఇందిరా నగర్ లో పోచమ్మ ఆలయం వద్ద 22 లక్షల 50 వేల రూపాయలు, 10వ వార్డు రిటైర్మెంట్ కాలనీ బోర్డు వద్ద 1 కోటి 24 లక్షల రూపాయలు, 11వ వార్డు లో గల సబ్‌స్టేషన్ వెనుక భాగంలో 28 లక్షల 36 వేల రూపాయలు, 15వ వార్డు లోని అరుమల్ల పోచం రోడ్డులో 42 లక్షల 60 వేల రూపాయల టి.యు.ఎఫ్.ఐ.డి.సి. నిధులతో అంతర్గత రహదారులు, మురుగు కాలువల నిర్మాణ పనులకు భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. 18వ వార్డు ఠాగూర్ స్టేడియం పార్క్ వద్ద 15 లక్షల రూపాయలు, 19వ వార్డు అబ్రహాం నగర్ బోర్డు వద్ద 15 లక్షల రూపాయల నగరాభివృద్ధి నిధులతో అంతర్గత రహదారులు, మురుగు కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి పై ప్రజల సౌకర్యార్థం 57 లక్షల రూపాయల డి ఎం ఎఫ్ టి నిధులతో రహదారులు- భవనాలు (ఎలక్ట్రికల్) శాఖ ద్వారా ఏర్పాటు చేసిన లైటింగ్ వ్యవస్థ ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో గల ప్రతి ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.