కేటీఆర్–కవిత ఐక్యత అవసరం: ఓవైసీ

భారత్ న్యూస్ హైదరాబాద్….కేటీఆర్–కవిత ఐక్యత అవసరం: ఓవైసీ

అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ, BRS ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కేటీఆర్, కవితలను కలిసికట్టుగా ముందుకు నడవాలని చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అన్న–చెల్లెల మధ్య విభేదాలు కొనసాగడం పార్టీకి నష్టం చేస్తుందని వ్యాఖ్యానించారు.

వార్డు–5లో మజ్లిస్-ఇ-ఇత్తేహాద్-ఉల్-ముస్లిమీన్ అభ్యర్థి బరిలో ఉండగా, అదే చోట ఎమ్మెల్యే సోదరుడిని స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టారని ఓవైసీ గుర్తు చేశారు. ఇది పార్టీ అంతర్గత విభేదాల ప్రతిబింబమేనా అని ప్రశ్నించారు.

కేటీఆర్–కవిత మధ్య విభేదాల కారణంగానే ఇలాంటి పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ, ఆ ఎమ్మెల్యే త్వరలో భారతీయ జనతా పార్టీ లో చేరబోతున్నారని ఓవైసీ వ్యాఖ్యానించారు.