కార్తిక దీపం వ్యవహారం.. మద్రాసు హైకోర్టు కీలక తీర్పు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..కార్తిక దీపం వ్యవహారం.. మద్రాసు హైకోర్టు కీలక తీర్పు

తమిళనాడు తిరుప్పరంకుండ్రంలో కార్తిక దీపం వ్యవహారంపై మద్రాసు హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పును డివిజన్‌ బెంచ్‌ సమర్థించింది.

ఈమేరకు మంగళవారం నిర్ణయాన్ని వెలువరించింది. తిరుప్పరంకుండ్రంలో కొండపై ఉన్న ఉచ్చిపిళ్లైయార్‌ ఆలయంలో ఏటా కార్తిక దీపం వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది.

కొండ పైభాగంలోని దీప స్తంభంలోనూ దీపం వెలిగించడానికి మద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌ సింగిల్‌ జడ్జి ఇటీవల అనుమతించారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సవాల్‌ చేసింది.