Telangana: జాయింట్ కలెక్టర్ పదవి రద్దు.. అదనపు కలెక్టర్లకు కొత్త బాధ్యతలు!

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….Telangana: జాయింట్ కలెక్టర్ పదవి రద్దు.. అదనపు కలెక్టర్లకు కొత్త బాధ్యతలు!

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ప్రభుత్వం పాలనాపరంగా సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ‘సర్వే అటవీ సరిహద్దుల సెటిల్మెంట్లు’ పథకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద పనిచేసే జాయింట్ కలెక్టర్ పదవిని కూడా రద్దు చేసింది.

ఈ పథకంలోని ఇతర సిబ్బందిని సైతం విధుల నుంచి విడుదల చేశారు. ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారుల (FSO) పనిని ఆయా జిల్లాల రెవెన్యూ అదనపు కలెక్టర్లకు అప్పగించారు. దీంతో ఇకపై అదనపు కలెక్టర్లే ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారులుగా వ్యవహరించనున్నారు.

అటవీ భూమిని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించడానికి ముందు వచ్చే అభ్యంతరాలను, ఇతర అటవీ సమస్యలను ఇకపై అదనపు కలెక్టర్లే పరిష్కరించనున్నారు. సర్వే పూర్తయ్యే వరకు జిల్లా రెవెన్యూ, అటవీ అధికారుల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.