బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్ – సింగరేణి జాగృతి సంయుక్త సమావేశం(ఏబీ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యవర్గ సమావేశం)

ఇటీవల హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత

కవితను ఘనంగా సత్కరించిన హెచ్ఎంఎస్, సింగరేణి జాగృతి నాయకులు

కల్వకుంట్ల కవిత కామెంట్స్

సింగరేణిలో అవినీతిపై సీబీఐకి కంప్లైంట్ చేస్తాం

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోంది

రాబోయే సింగరేణి ఎన్నికల్లో హెచ్ఎంఎస్ జెండా ఎగురబోతోంది

అవినీతిని కట్టడి చేయకుంటే సింగరేణి భవన్ ను ముట్టడిస్తాం : కల్వకుంట్ల కవిత

కాంగ్రెస్ అంటేనే కరెప్షన్ పార్టీ… సింగరేణిలో తీవ్రమైన అవినీతికి పాల్పడుతున్నారు

ప్రతి కాంట్రాక్ట్ లో 25 శాతం అవినీతి జరుగుతోంది. 10 శాతం వాటా కాంగ్రెస్ పెద్దలకు వెళ్తోంది.

సింగరేణిలో అవినీతిని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించం… అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం, సీఎంలను డిమాండ్ చేస్తున్నాం.. ప్రభుత్వం స్పందించకుంటే మేమే సీబీఐకీ, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం

సింగరేణిలో జరుగుతోన్న అవినీతికి వ్యతిరేకంగా హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి భవన్ ను ముట్టడిస్తాం

త్వరలోనే జరగబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికుల విశ్వాసం పొంది హెచ్ఎంఎస్ గెలుస్తుందని ధీమాగా చెప్తున్న

హెచ్ఎంఎస్ లో గౌరవాధ్యక్షురాలిగా నన్ను ఎన్నుకున్నారు.. మీరిచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటూ కార్మికుల బాగు కోసం పనిచేస్తానని హామీ ఇస్తున్నాను

టీబీజీకేఎస్ అనేది మొన్న ఎన్నికల్లో పోటీనే చేయలేదు

గుర్తింపు సంఘం అనుకుంటున్న వాళ్లు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు… నిజానికి సింగరేణి ఎన్నికల్లో వాళ్లకు గెలిచే అంతా సీన్ లేదు

అప్పుడు ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ కారణంగా ఆ పరిస్థితి వచ్చింది

సింగరేణిలో ఇప్పుడున్న ఎర్రజెండా కాకుండా మరొక జెండా ముందుకు రాబోతోంది

హెచ్ఎంఎస్, జాగృతి సంస్థలు మొత్తం 40 వేల మంది సింగరేణి కార్మికుల కోసం పనిచేస్తాయి

కార్మిక చట్టాలన్నీ అమలయ్యేలా మనం పోరాటం చేద్దాం

గతంలో కేసీఆర్ గారు చెప్పారనే టీబీజీకేఎస్ కు ఓటు వేశారు… సంఘం గౌరవ అధ్యక్షురాలిగా నేను కార్మికుల సమస్యలపై స్టడీ చేసి కేసీఆర్ గారితో మాట్లాడి వాటిని పరిష్కరించాను

కేసీఆర్ గారు ఇప్పుడు అధికారంలో లేరు.. సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పుడున్న టీబీజీకేఎస్ నాయకులు ఎందుకు పోరాటం చేయటం లేదో కార్మికులకు, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి

ప్రతిక్షణం కార్మికుల కోసం ఫీల్డ్ లో ఉండి పనిచేసే వారే కార్మిక సంఘం గెలుస్తారు

టీబీజీకేఎస్ నాయకులు అవినీతి చేయొద్దని గతంలో నేను ఎన్నోసార్లు చెప్పాను.. అయినా నాయకులు స్వార్థంతో అవినీతి చేశారు

కార్మిక సంఘాల్లో యువతను ప్రోత్సహించాలని కోరినా పట్టించుకోలేదు

సింగరేణి కార్మికులకు పైసా ఖర్చు లేకుండా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి

దీని మీద టీజీబీఎస్ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు?

నిన్నటి దాకా ఉన్న సంఘంపైనే విమర్శలు ఏంటనీ కొందరు అనవచ్చు.. కానీ అక్కడ జరిగిన పరిస్థితులపై కచ్చితంగా మాట్లాడాల్సిన అవసరముంది

కేసీఆర్ గారు సింగరేణి సంస్థను కన్నబిడ్డలా చూసుకున్నారు.. వారి మార్గంలోనే హెచ్ఎంఎస్ కూడా పనిచేస్తుంది

కాంగ్రెస్ ప్రభుత్వానికి వారి తీరుకు వ్యతిరేకంగా కొట్లాడుదాం

సింగరేణి లో వారసత్వ ఉద్యోగాలను తగ్గించేందుకు కొత్త కొర్రీలు పెడుతున్నారు

పదో తరగతి పాస్ కాలేదంటూ 470 అప్లికేషన్స్ ఆపేశారు.. చదువుతో సంబంధం లేకుండా వారసత్వ ఉద్యోగాలను నియమించాలి

రాష్ట్రంలో ఉన్న మైన్స్, మినరల్స్ ను వినియోగించుకొని ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు సృష్టించాలి

సింగరేణి ప్రాంత ప్రజలకు దక్కాల్సిన నిధులను దారి మళ్లిస్తున్నారు

లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం 42 వేల కోట్ల బకాయిలు పెట్టి నష్టాల్లోకి నెట్టేస్తోంది.. ఇలా చేస్తే సంస్థ భవిష్యత్ ఏం కావాలి?

గతంలో సింగరేణి కార్మికుల రిటైర్మెంట్ వయోపరిమితి పెంచుకోలేకపోయాం.. దానికి పరిష్కారంతో పాటు మెడికల్ బోర్డు తెచ్చుకునేందుకు పోరాటం చేద్దాం

సింగరేణి లో పనిచేయటమంటేనే ఎంతో రిస్క్ తో కూడుకున్నది

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సరే వారికి పూర్తి స్థాయిలో భద్రత ఉండదు

సంస్థలో డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ విధానం కొనసాగాలి

కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ను మనుషులే కాదన్నట్లుగా చూస్తున్నారు

గతంలో నేను వారికి మినిమమ్ వేజేస్ వచ్చేలా కృషి చేశాను

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే

మహిళ కార్మికుల సంక్షేమం, వారి వసతుల కోసం కూడా పోరాటం చేద్దాం

హెచ్ఎంఎస్ లో సభ్వత్యాలు పెంచాలి. ట్రైనింగ్ ప్రొగ్రామ్స్ కూడా పెట్టుకుందాం

హెచ్ఎంఎస్, జాగృతి రెండు కళ్లలా పనిచేస్తాయి.

హెచ్ఎంఎస్, జాగృతి కొత్త కాంబినేషన్… అదే విన్నింగ్ కాంబినేషన్ కాబోతుంది