వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ ఆర్చరీ పోటీల ఫైనల్ క్రీడను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.

భారత్ న్యూస్ డిజిటల్:ఆదిలాబాద్ :

ఆటల్లో గెలుపోటములు సహజం.

“వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ ఆర్చరీ పోటీల ఫైనల్ క్రీడను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.

అన్ని రంగాల్లో ముందుంటూ, తమ సమాజానికి స్ఫూర్తిగా ఆదర్శంగా నిలవాలని సూచన.

స్థానిక ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో ఆరు జిల్లాల విద్యార్థులచే పోటీలు.

ఈరోజు ఉదయం ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ నందు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ వనవాసి కళ్యాణ పరిషత్ ద్వారా నిర్వహించబడుతున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ మరియు ఆర్చరీ పోటీలలోని ఫైనల్ క్రీడలను ప్రారంభించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. ఓడినవారు వచ్చే సంవత్సరం మరింత కష్టపడి గెలవడానికి కృషి చేయాలని తెలిపారు. ఆరు జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మీరు మీ సమాజానికి ఆదర్శప్రాయంగా నిలుస్తూ భవిష్యత్తు లో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని తెలిపారు. ప్రపంచం పరిగెడుతున్న వేగంతో అభివృద్ధిని సాధించే దిశగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సూచించారు. ఉన్నత చదువులను అభ్యసించాలని, ఉన్నత లక్షలను ఛేదించేదిశగా కృషి చేయాలని తెలిపారు. వాలీబాల్ మరియు అర్చరీ నందు చివరి పోటీలను జిల్లా ఎస్పీ స్వయంగా ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచి ప్రారంభించారు.