భారత్ న్యూస్ ఢిల్లీ…..120 కిలో న్యూటన్ ఇంజిన్ తయారీ దిశగా భారత్
ఫ్రాన్స్‌కు చెందిన సఫ్రాన్ ఎస్ఏ సంస్థతో కలిసి భారత్ 120 కిలో న్యూటన్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది.
డీఆర్డీవో ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇండియాస్ గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ ప్రాజెక్టులో భాగస్వామి కానుంది.

ఈ 120 కిలో న్యూటన్ ఇంజిన్ అభివృద్ధి, తయారీ పూర్తయితే.. ఇది ట్విన్ ఇంజిన్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఎంతగానో ఉపయోగపడుతుంది.