భారత్ న్యూస్ హైదరాబాద్….ఇన్కమింగ్ కాల్స్‌లో పేరు డిస్ప్లే
మన మొబైల్‌కు ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే ట్రూ కాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడుతున్నాం. ఇకపై అలాంటి అవసరం లేకుండా, ఫోన్ కనెక్షన్ సమయంలో ఇచ్చిన ఐడీలోని పేరు ఇన్కమింగ్ కాల్స్ సమయంలో మొబైల్ స్క్రీన్‌పై కనిపించే సౌకర్యం అందుబాటులోకి రానుంది.ఈ మేరకు టెలికమ్యూనికేషన్స్ శాఖ అందించిన ప్రతిపాదనలను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇది అందుబాటులోకి రానుంది
