..భారత్ న్యూస్ హైదరాబాద్….పర్యావరణహిత నగర నిర్మాణమే హైడ్రా లక్ష్యం: రంగనాథ్
తెలంగాణ : పర్యావరణ హితమైన, అందరికీ నివాస యోగ్యమైన నగర నిర్మాణమే హైడ్రా లక్ష్యమని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. టోలీచౌక్‌లో ఏర్పాటు చేసిన ‘హైడ్రా బస్తీతో దోస్తీ’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘హైడ్రా అంటే భయం కాదు.. నగర ప్రజలందరికీ ఓ అభయం. చెరువులు, నాలాలు, ప్రజా స్థలాలను కబ్జా చేసిన వారు హైడ్రాను బూచిగా చూపించి వారి కబ్జాలను కాపాడుకోడానికి చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి’ అని పిలుపునిచ్చారు. .
