హైదరాబాద్‌లో భారీగా రద్దయిన పెద్ద నోట్లు పట్టివేత

.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లో భారీగా రద్దయిన పెద్ద నోట్లు పట్టివేత

హైదరాబాద్‌: నగరంలో భారీగా రద్దయిన పెద్ద నోట్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. నారాయణగూడలో తనిఖీలు చేపట్టిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 బ్యాగులు స్వాధీనం చేసుకోగా.. వాటిలో రూ. 2కోట్లు విలువైన రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని పోలీసులు జప్తు చేశారు.