హోలీ పండుగపై చంద్రగ్రహణం ప్రభావం..!

.భారత్ న్యూస్ హైదరాబాద్….హోలీ పండుగపై చంద్రగ్రహణం ప్రభావం..!

హోలీ 2026 తేదీపై దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది.
దీనికి ప్రధాన కారణం మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా, కామ దహనం, హోలీ తేదీల విషయంలో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
చంద్రగ్రహణం మరియు సూతక కాలం కారణంగా మార్చి 3న రంగుల పండుగ నిర్వహించడం శాస్త్రపరంగా సముచితం కాదని పండితులు చెబుతున్నారు.
అందుకే దేశవ్యాప్తంగా మార్చి 4, 2026 (చైత్ర కృష్ణ పక్ష ప్రతిపద)న హోలీ జరుపుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై ప్రభుత్వం ఇంకా ఏలాంటి నిర్ణయం తీసుకోలేదు.