భారత్ న్యూస్ హైదరాబాద్….ఆస్తి కోసం తోడబుట్టిన వారితో కొట్లాడి ఏం సాధిస్తారు??? – తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్ :
తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత వరకు పిల్లలు ఆస్తిలో వాటా కోరకుండా ఉండే చట్టం తెస్తే బాగుంటుంది
44 గజాల స్థలం కోసం కోర్టు మెట్లు ఎక్కిన కుటుంబం, విచారణ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు
264 గజాల స్థలం కోసం హైకోర్టులో పిటిషన్ వేసిన ఆరుగురు కుటుంబసభ్యులు (తల్లిదండ్రులతో కలిపి)
విచారణ సమయంలో ఒక్కో మనిషికి 44 గజాల స్థలం వస్తుందని, ఆ స్థలంలో ఇల్లు కూడా కట్టుకోలేరు కదా అని ప్రశ్నించిన జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి

మాకు అధికారం ఉండుంటే తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత వరకు పిల్లలు ఆస్తిలో వాటా అడగకుండా చట్టం తెచ్చే వాళ్లమని అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు