.భారత్ న్యూస్ హైదరాబాద్….బసవతారకం హాస్పిటల్ 25వ వార్షికోత్సవ వేడులల్లో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారు
కార్యక్రమానికి హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, నందమూరి బాలకృష్ణ
సిల్వర్ జూబ్లీ సందర్బంగా బసవతారకం డాక్టర్లు, సిబ్బంది, మేనేజ్మెంట్కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
కేన్సర్‌తో మృతి చెందిన తన భార్య బసవతారకం గారి పేరిట ఎన్టీఆర్ గారు, 25 ఏండ్ల కిందట ఈ హాస్పిటల్ ప్రారంభించారు.
నాటి నుంచి నేటి వరకూ లక్షల మంది పేషెంట్లకు ఈ హాస్పిటల్ వైద్య సేవలు అందిస్తోంది.
ఎన్టీఆర్ గారు ఐకానిక్ లీడర్, లెజెండరీ యాక్టర్ .. సినిమా, సామాజిక సేవలో ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తి
నాటి ఆయన విజనే నేటి ఈ హాస్పిటల్
లక్షలాది మంది పేద రోగులకు జీవితంపై ఆశ, నమ్మకం అందిస్తోంది..
కేన్సర్ సమస్య దేశవ్యాప్తంగా పెరుగుతోంది.
తెలంగాణలో ప్రతి ఏటా 50 నుంచి 55 వేల మంది కొత్తగా కేన్సర్ భారిన పడుతున్నారు
ఇవి కేవలం నంబర్లు కాదు.. రోగుల జీవితాలను, వారి కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదకర వ్యాధి ఇది
ఎర్లీ స్టేజ్‌లో గుర్తిస్తేనే ఈ వ్యాధిని నయం చేయగలం
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొబైల్ కేన్సర్ స్క్రీనింగ్ యూనిట్లను ప్రారంభించబోతున్నాం.
ప్రతి జిల్లాల్లో కేన్సర్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. త్వరలోనే వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం.
కేన్సర్ స్క్రీనింగ్, డయాగ్నొసిస్, డే కేర్ కీమోథెరపి, పాలియేటివ్ కేర్ వంటి సేవలన్నీ ఈ సెంటర్లలో అందిస్తాం.
ఇంకా అడ్వాన్స్డ్ వైద్య సేవలు అందించేలా రీజనల్ కేన్సర్ కేర్ సెంటర్లను అందుబాటులోకి తీసుకు రాబోతున్నాం.
పేద పేషెంట్లకు సేవలు అందిస్తున్న బసవతారకం వంటి హాస్పిటళ్లకు ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందిస్తాం.
ఎన్టీఆర్ గారు స్థాపించిన ఈ హాస్పిటల్‌ను నడిపిస్తూ, పేదలకు సేవలు అందిస్తున్న బాలకృష్ణ గారికి నా అభినందనలు.
