..భారత్ న్యూస్ హైదరాబాద్….ఫ్రీ బస్ నష్టాలు భరించలేక పోతున్నాం… రూ.400 కోట్లకు గౌలిగూడ బస్టాండ్ తాకట్టు!
📍ఆర్టీసీ లాభాల్లో ఉందని గొప్పలు చెప్పుకుంటూనే ఆస్తులు తాకట్టు ఎందుకని ఉద్యోగుల సంఘాల ప్రశ్నలు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం వల్ల ఆర్టీసీ ఆర్థికంగా కుంగిపోతోంది.
ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న యాజమాన్యం.
ఫ్రీ బస్సు నిధులు విడుదల చేయకపోవడంతో ఆస్తులను తాకట్టు పెట్టి వేతనాల కోసం ప్రభుత్వం సిద్ధమవుతుంది.
హైదరాబాద్‌లోని 5.8 ఎకరాల చారిత్రాత్మక గౌలిగూడ బస్టాండ్‌ను తాకట్టు పెట్టి, కొల్లేటరల్ సెక్యూరిటీగా ఉంచి, హడ్కో నుంచి రూ.400 కోట్ల రుణం తీసుకోనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
ఆర్టీసీ అప్పుల నుండి బయటపడాలంటే రూ.11 వేల కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు.
