మున్సిప‌ల్ చ‌ట్ట స‌వ‌ర‌ణ ఆర్డినెన్స్‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.మున్సిప‌ల్ చ‌ట్ట స‌వ‌ర‌ణ ఆర్డినెన్స్‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

తెలంగాణ :

రాష్ట్ర మున్సిపల్‌ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ 3కి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆమోదం తెలిపారు.

ఈ ఆర్డినెన్స్‌ ద్వారా సంగారెడ్డి జిల్లాలో ఇంద్రీశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటుకు ఆమోదం లభించింది.

మున్సిపల్‌ ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులకు సైతం ఓటుహక్కు కల్పించేలా తెలంగాణ మున్సిపల్‌ చట్టంలోని సెక్షన్‌-20కి సవరణ చేశారు..