ప్రభుత్వ ఉద్యోగులపై సాధారణ ఫిర్యాదులపై మూడు నెలల్లో, తీవ్ర ఆరోపణలపై ఐదారు నెలల్లో విచారణ పూర్తి

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..ప్రభుత్వ ఉద్యోగులపై సాధారణ ఫిర్యాదులపై మూడు నెలల్లో, తీవ్ర ఆరోపణలపై ఐదారు నెలల్లో విచారణ పూర్తి

ఆరోపణలు రుజువైతే వెంటనే శిక్షలు అమలు

ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు

📍విధి నిర్వహణలో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన, అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులపై విచారణలను వేగవంతం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ పూపొందించింది. ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చే సాధారణ ఫిర్యాదుల్లో శాఖాపరమైన అధికారులు మూడు నెలల్లో, తీవ్రమైన ఆరోపణల విషయంలో విచారణ కమిషన్లు ఐదారు నెలల్లో విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఆరోపణలు రుజువైతే వెంటనే శిక్షను ఖరారు చేయాలని సూచించింది. విచారణకు నిర్ణీత గడువు విధిస్తూ ఎవరైనా వేగంగా పూర్తిచేయడంలో నిర్లక్ష్యం విహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అందుకు సంబంధిత విచారణాధికారి/ సంస్థ బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది.

క్రమశిక్షణ చర్యల కేసులను ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు నిర్ణీత గడువు దాటిన తరువాత పెండింగ్ కేసుల వివరాల నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ముఖ్యమంత్రికి అందించాలని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమగ్ర మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీచేశారు. క్రమశిక్షణ చర్యల దస్త్రం ఏ అధికారి వద్దా మూడు రోజులకు మించి ఉండటానికి వీల్లేదని, మంత్రులకు పంపించాల్సిన కేసుల విషయంలో వారం రోజుల్లోనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్దేశించారు.

నిబంధనలు :

  • అక్రమాలు బయటపడిన తర్వాత సంబంధిత ఉద్యోగి/ అధికారిపై అభియోగాల నమోదులో జాప్యం చేయకూడదు. వెంటనే ప్రాథమిక విచారణ పూర్తిచేయాలి. తీవ్రమైన ఉల్లంఘనలు, అక్రమాలు జరిగాయని తేలితే అభియోగాలు నమోదు చేయాలి. కొన్ని సందర్భాల్లో జాప్యంతో అభియోగాల నమోదులో ఆ ఉద్యోగి/ పింఛనుదారు శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు.
  • అభియోగాలు నమోదు చేసేటప్పడు సాధారణ పదజాలంతో కాకుండా నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ స్పష్టమైన అభియోగాలు, తీవ్రత వివరాలు పేర్కొనాలి. అభియోగాలకు సంబంధించిన అన్ని అధారాలను విచారణాధికారి/ సంస్థ తనిఖీ చేసి, సాక్షులతో కూడిన వివరాలు నమోదు చేయాలి. వీటిని ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి ఇచ్చి, లిఖిత పూర్వక సమాధానం తీసుకోవాలి.
  • ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగి ఇచ్చిన సమాధానాన్ని సీనియర్ అధికారి ఆధ్వర్యంలో అన్ని రికార్డులతో పరిశిలించి సరిచూసుకోవాలి. తద్వారా చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్లాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోవచ్చు. లభించిన ఆధారాలు చర్యలకు సరిపోతాయో లేదో తెలుస్తుంది.
  • ప్రజెంటింగ్ అధికారి ఆ విచారణ వివరాలను విచారణ సంస్థ ముందు సమగ్రంగా సమర్పించాలి. విచారణ ఎదుర్కొంటున్న అధికారి కన్నా ప్రజెంటింగ్ అధికారి సీనియర్ అయి ఉండాలి.
  • క్రమశిక్షణ చర్యల అధికారులు విచారణ సంస్థకు సకాలంలో రికార్డులు పంపించడం లేదు. అపాయింట్​మెంట్ ఆర్డర్ సహా అన్ని వివరాలు అడిగిన వెంటనే పంపాలి.
  • విభాగాధిపతులు రికార్డులను సచివాలయ విభాగానికి పంపించే ముందు ఒకసారి పరిశీలించాలి. అత్యవసరం కాదన్నట్లు కిందిస్థాయి అధికారులు పక్కన పెట్టడం సరికాదు. కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ కేసులను వేగంగా పరిష్కరించాలి.
  • అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారిపై ప్రాథమిక, పూర్తిస్థాయి నివేదిక వచ్చిన ఏడాదిలోగా చర్యలు పూర్తిచేయాలి. ఒకవేళ తీవ్ర జాప్యం జరిగితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత మంత్రికి పంపించి, నిర్ణీత గడువులోగా అనుమతి తీసకుని చర్యుల తీసుకోవాలి.
  • విశ్రాంత ఉద్యోగుల విషయాల్లో టీజీపీఎస్సీ నుంచి నివేదిక వచ్చిన వారం రోజుల్లో నిర్ణయం తీసుకుని పింఛనుపై పెనాల్టీ విధించాలి.
  • భారీ సంఖ్యలో సాక్షుల విచారణ, రికార్డులు, తదితరాలను పిరశీలించాల్సిన సమయంలో సంబంధిత అధికారుల నుంచి ముందస్తుగా లిఖితపూర్వక అనుమతులు తీసుకోవాలి. ఉద్యోగుల పదివీ విరమణ వయసును పరిగణనలోకి తీసుకుంటూ విచారణ వేగంగా పూర్తి చేయాలి.

క్రమశిక్షణ చర్యల అధికారి/సంస్థ పాటించాల్సిన కాలవ్యవధి :

విచారణ పూర్తయిన త

విచారణాధికారి/ సంస్థ నియామకం తరువాత రెండు వారాల్లోగా విచారణ తేదీ ఖరారు, అన్ని పత్రాల పరిశీలన పూర్తి చేయాలి.

అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారి ఇచ్చిన పత్రాల పరిశీలన 2 వారాల్లో పూర్తిచేయాలి.

రెగ్యులర్ విచారణలో సాక్షులను విచారించేందుకు సమన్లజారీ, విచారణ తేదీ 2 వారాల్లోగా ఖరారు చేయాలి.

రోజువారీ విచారణ 2 వారాల్లో ముగించాలి.

ప్రజెంటింగ్ అధికారి, అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారి రెండు వారాల్లోగా విచారణాధికారికి రాతపూర్వకంగా వివరణను అందించాలి.