జనగణన-2027కు గెజిట్ నోటిఫికేషన్

భారత్ న్యూస్ హైదరాబాద్….జనగణన-2027కు గెజిట్ నోటిఫికేషన్

దేశంలో ‘జనగణన-2027’కు సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ గెజిట్ విడుదల చేశారు.

2026 ఏప్రిల్ 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు రెండు దశల్లో దీన్ని చేపడతారు. తొలిదశలో ఇళ్లు, గృహాల వివరాలు, మలిదశలో జనాభా లెక్కింపు ఉంటుంది. ఈసారి జనాభా లెక్కల్లో కులాల సమాచారాన్ని సేకరించనున్నారు.

వ్యక్తిగత వివరాల్ని డిజిటల్గా అందించే అవకాశం కూడా కల్పిస్తారు.