.భారత్ న్యూస్ హైదరాబాద్….నిమ్స్‌లో చికిత్స పొందుతున్న దివంగత ప్రజా గాయకుడు గద్దర్ సతీమణి విమల గారిని పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్
దివంగత ప్రజా గాయకుడు గద్దర్ గారి సతీమణి శ్రీమతి విమల గారు గాల్ బ్లాడర్ సమస్యతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఆమెకు నేడు శస్త్రచికిత్స నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, బిసి & రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నిమ్స్‌ను సందర్శించి విమల గారిని పరామర్శించారు. అనంతరం నిమ్స్ డైరెక్టర్ డా. బీరప్పను కలిసి ఆమెకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు.

ప్రభుత్వ తరఫున అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందించాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.