కొడుకు పట్టించుకోవడం లేదని రూ.3 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి దానం చేసిన మాజీ ఎంపీపీ

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….కొడుకు పట్టించుకోవడం లేదని రూ.3 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి దానం చేసిన మాజీ ఎంపీపీ

ఆ స్థలంలో తన భార్య జ్ఞాపకార్ధం ఒక భవనం నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో తన కొడుకు రంజిత్ రెడ్డి ఆస్తి లాక్కొని ఇంటి నుండి గెంటేశాడని, తన కూతురికి కట్నం కింద ఇచ్చిన భూమిని సైతం ఆక్రమించాడని ఆవేదన వ్యక్తం చేసిన మాజీ ఎంపీపీ (2006–11) గోలి శ్యామ్ సుందర్ రెడ్డి

తన సొంత ఇంటిని, తన భార్య పేరిట ఉన్న భూమిని సైతం లాక్కున్నాడని, అదేంటని అడిగితే తనపైనే దాడి చేశాడని శ్యామ్ సుందర్ రెడ్డి ఆందోళన

ఈ క్రమంలో తనకున్న 6 ఎకరాల భూమిలో 3 ఎకరాలను ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు, హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్‌కు తెలిపిన సదరు వ్యక్తి

ఆ స్థలంలో చనిపోయిన తన భార్య వసంత పేరిట ఒక భవనం నిర్మించాలని, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన వారికి ఇది ఒక గుణపాఠం కావాలని పేర్కొన్న శ్యామ్ సుందర్ రెడ్డి