రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, ఉత్పన్నమైన పరిస్థితులు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ నివాసంలో సమీక్ష

..భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, ఉత్పన్నమైన పరిస్థితులు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారితో పాటు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.

వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయటంతో పాటు తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. స్థానికంగా ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా సహాయక చర్యలను ముమ్మరం చేయాలని చెప్పారు.