భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….మెదక్ జిల్లా ముంపు ప్రాంతాలను పర్యటించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు..
రాజాపేట గ్రామంలో వరదలో చిక్కుకొని చనిపోయిన సత్యం కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు బృందం. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..
మెదక్, కామారెడ్డి వరద ప్రవాహంలో ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి మూసి సుందరీ కరణ, ఆటల పోటీల అంశంపై రివ్యూ చేస్తున్నారు.
ఒక మంత్రి అయితే అత్యవసరమైతే తప్ప హెలికాప్టర్ వాడలేము అని అంటున్నారు.
మెదక్ జిల్లా రాజాపేట్ వరదల్లో చిక్కుకొని ఇద్దరు కరెంటు పోల్ ఎక్కి నాలుగైదు గంటలు గా సహాయం కోసం ఎదురుచూసారు.
హెలికాప్టర్ పంపించి ఉంటే వాళ్ళు ప్రాణాలతో దక్కేవారు.
చనిపోయిన రెండు కుటుంబాలకు 25 లక్షల ఆర్థిక సహాయం చేయాలి.
నష్టపోయిన పంట పొలాలకు ఎకరానికి 25000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి.
ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

మెదక్ ముంపు ప్రాంతాలకు ప్రజలు సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారు.
తాగునీరు లేకపోవడంతో వర్షం నీరు తాగుతున్నారు.
ధూప్ సింగ్ తాండా ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వం ఇప్పటికి అయిన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. -మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు..