భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…కరీంనగర్ సిరిసిల్ల జడ్పీ పీఠాలపై కాషాయ జెండా ఎగరవేస్తాం’
కరీంనగర్, సిరిసిల్ల జడ్పీ పీఠాలపై కాషాయజెండా ఎగరవేస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండల అధ్యక్షులు, జడ్పీటీసీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లను ఓడించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ కు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన లేదని, కేంద్ర నిధులు వస్తాయనే ఎన్నికలు నిర్వహిస్తోందని విమర్శించారు. ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు…..
