అమెరికాలో శాంతా క్లారా పోలీసుల కాల్పుల్లో జిల్లా వాసి నిజాముద్దీన్ మృతి.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….మహబూబ్ నగర్ జిల్లా:

అమెరికాలో శాంతా క్లారా పోలీసుల కాల్పుల్లో జిల్లా వాసి నిజాముద్దీన్ మృతి.

అమెరికా కాలమానం ప్రకారం నిన్న ఉదయం శాంతా క్లారా పోలీసులకు ఇరుగుపొరుగు వారి నుంచి డిస్టర్బెన్స్ కాల్.

దీంతో ఘటన స్థలికి వెళ్లి చూడగా ఓ ఇంట్లో గొడవ జరుగుతున్న శబ్ధాలు గమనించిన పోలీసులు.

తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి చూడగా నిజాముద్దీన్, మరో రూమ్ మెట్ తో గొడవ.

రూమ్ మెట్ పై నిజాముద్దీన్ కత్తితో దాడి చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారణ.

వద్దని వారించిన వినకపోవడంతో నిజాముద్దీన్ పై కాల్పులు జరిపిన పోలీసులు.

ఘటనపై కొనసాగుతున్న శాంతా క్లారా పోలీసుల దర్యాప్తు.

కత్తిపోట్లకు గురైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.

ఘటన సమయంలో అక్కడే ఉన్న మరో ఇద్దరు రూమ్ మెట్స్.

ఆగస్టు నెలలో ఏసీ విషయంలో ఇద్దరికి గొడవ.

2016 ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నిజాముద్దీన్.

యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా లో ఎం.ఎస్ పూర్తి చేసి కొన్ని రోజుల పాటు ఉద్యోగం చేసిన నిజాముద్దీన్.

ఉద్యోగం అగ్రిమెంట్ పూర్తి కావడంతో ఎక్స్ టెన్షన్ లేక స్నేహితులతో రూమ్ లో ఉంటున్న నిజాముద్దీన్.